కోలీవుడ్ బాట పట్టిన ఫరియా అబ్దుల్లా!
- 'జాతిరత్నాలు'తో పరిచయమైన ఫరియా
- తెలుగులో అంతగా పలకరించని అవకాశాలు
- కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అడుగులు
- విజయ్ ఆంటోని సరసన నాయికగా ఛాన్స్
కానీ అలాంటిదేమీ జరగలేదు. రవితేజ సినిమా 'రావణాసుర'లో ఆ ఐదుగురు హీరోయిన్స్ లో ఆమె ఒకరుగా కనిపించనుంది. ఇక ఆ తరువాత చేతిలో ప్రాజెక్టులు లేవు. దాంతో బిందుమాధవి .. స్వాతి రెడ్డి .. ఆనంది .. అంజలి మాదిరిగానే ఫరియా కూడా కోలీవుడ్ బయటపెట్టేసింది.
తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో ఆయన సరసన నాయికగా ఆమె నటించనుందని అంటున్నారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి యువతిగా కనిపించనుందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.