వివేకా హత్య కేసు: సీబీఐ నోటీసులు తీసుకోని వైయస్ అవినాశ్ రెడ్డి
- వైయస్ వివేకా హత్య కేసులో అవినాశ్, ఆయన తండ్రికి సీబీఐ నోటీసులు
- నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన తండ్రీకొడుకులు
- కడప జిల్లా కోర్టును ఆశ్రయించిన సీబీఐ
ఈ క్రమంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు నిన్న పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం. దీంతో, కడప జిల్లా కోర్టును వారు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈరోజు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.