'అశోకవనంలో..' నుంచి ఆకట్టుకునే సాంగ్!
- విష్వక్ సేన్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
- పెళ్లి చూపులు ప్రధానంగా సాగే కథ
- కథానాయికగా రుక్షార్ థిల్లోన్
- వచ్చేనెల 4వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా, ఓరోరి సిన్నవాడా సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా .. ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా" అంటూ ఈ పాట సాగుతోంది. హీరోను ఉద్దేశించి హీరోయిన్ పాడే పాట ఇది.
బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. జై క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి సానపాటి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా, అనన్య భట్ - గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విష్వక్ సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.