'మేజర్' రిలీజ్ డేట్ ఖరారు!
- 'మేజర్'గా అడివి శేష్
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
- మే 27వ తేదీన విడుదల
వాస్తవానికి ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతూ రావడంతో, విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు.
శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికలుగా సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి .. మురళీశర్మ పోషించారు. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ వలన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.