కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తీవ్రస్థాయిలో స్పందించిన చిన్ననాటి కోచ్
- ఇటీవలే టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ
- వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన సెలెక్టర్లు
- కోహ్లీ వన్డేల్లో విజయవంతమైన కెప్టెన్ అన్న కోచ్
- గంగూలీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని వ్యాఖ్య
కోహ్లీ వన్డేల్లో విజయవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నాడని, కానీ అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం విచారకరమని పేర్కొన్నారు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐ కోహ్లీకి సూచించిందని గంగూలీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని రాజ్ కుమార్ శర్మ వెల్లడించారు. ఈ వ్యవహారాలపై తాను ఇప్పటివరకు కోహ్లీతో మాట్లాడలేదని, కొన్ని కారణాల వల్ల ఫోన్ స్విచాఫ్ చేసినట్టుందని చెప్పారు.