సెట్స్ పై చరణ్ మూవీ .. పాట కోసం 12 రోజులు!
- ఇటీవలే సెట్స్ పైకి శంకర్ సినిమా
- పూణేలో జరుగుతున్న షూటింగు
- పాట చిత్రీకరణలో బిజీగా టీమ్
- భారీ బడ్జెట్ కేటాయించిన దిల్ రాజు
ఈ పాట చిత్రీకరణ కోసం 12 రోజులను కేటాయించారు. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాల్లో పాటల సంగతి వేరు. ఆయన సినిమాల్లోని పాటలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. పాట కోసమే ఆయన కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తూ ఉంటాడు.
అలా ఇప్పుడు చరణ్ .. కియారాపై చిత్రీకరిస్తున్న పాట కూడా అద్భుతమైన విజువల్స్ తో తెరపై ఆవిష్కృతమవుతుందట. అందుకోసం ఈ పాట చిత్రీకరణకు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ పాటకి గల ప్రాధాన్యత కారణంగానే, దిల్ రాజు ఖర్చుకు వెనకాడలేదని చెప్పుకుంటున్నారు.