దసరాకి మరింత పెరుగుతున్న పోటీ!
- రోషన్ హీరోగా 'పెళ్లి సందD'
- కథానాయికగా కన్నడ బ్యూటీ పరిచయం
- ఆకట్టుకున్న ట్రైలర్
- దసరాకి భారీ విడుదల
ఈ నేపథ్యంలో రోషన్ - శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన 'పెళ్లి సందD' నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా కూడా దసరా బరిలోకి దిగుతూ ఉండటంతో పోటీ మరింత పెరుగుతోంది.
అఖిల్ హీరోగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లోని 'కొండపొలం' సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబస్ 14వ తేదీన 'మహాసముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మిగిలిన తేదీల్లో 'పెళ్లి సందD' ఎప్పుడు జరుగుతుందో చూడాలి.