ఈడీ విచారణకు ఇప్పుడు హాజరు కాలేను.. అధికారులకు సమాచారం పంపిన రకుల్
- డ్రగ్స్ కేసులో సెప్టెంబరు 6న విచారణ
- వరుస షూటింగులతో బిజీగా ఉన్నానన్న హీరోయిన్
- హాజరవడానికి గడువు కోరిన రకుల్
- ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి హాజరు
నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనిపై విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ.. కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును ఈడీ టేకప్ చేసింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది.
వీరిలో ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.