అల్లు అర్జున్ జోడీగా అనన్య పాండే?
- బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్
- 'లైగర్'తో తెలుగు తెరకు పరిచయం
- 'ఐకాన్' కోసం సంప్రదింపులు
- దాదాపు ఓకే అయ్యే ఛాన్స్
ఆయన తాజా చిత్రమైన 'లైగర్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయం కానుంది. విజయ్ దేవరకొండ జోడీగా ఆమె ఆరబోసే అందాలు చూడటానికి ఇక్కడి కుర్రాళ్లంతా కాచుకుని కూర్చున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే ఈ భామ అల్లు అర్జున్ జోడీగా ఛాన్స్ కొట్టేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.
'పుష్ప' సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా అనన్య పాండేను ఎంపిక చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.