పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: శ్రీముఖి
- మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుంది
- ప్రస్తుతం నా వయసు 28 ఏళ్లు
- 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో శ్రీముఖి బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని... ఏదైనా మన అదృష్టాన్ని బట్టే జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని... తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది.