సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'పుష్ప' షూటింగులో అనసూయ
- టీవీ షో కోసం ఎన్టీఆర్ షూటింగ్
- తేజ చిత్రానికి మ్యూజిక్ సిటింగ్స్
* కథానాయకుడు ఎన్టీఆర్ తాజాగా జెమిని టీవీ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షోని హోస్ట్ చేయనున్న విషయం విదితమే. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పదిరోజుల పాటు ఈ షోకి షూటింగ్ చేయడానికి ఆయన డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
* ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్ లోని పలు లొకేషన్లలో జరుగుతుంది.