రిలీజ్ కి ఉత్సాహంగా ఉన్న 'లవ్ స్టోరీ'
- శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
- కరోనా కారణంగా వెనక్కి వెళ్లిన విడుదల
- ఈ నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటూ టాక్
- జనంలోకి దూసుకుపోయిన 'సారంగ ధరియా'
ఇక ఇప్పుడు పరిస్థితి కొంతవరకు అనుకూలంగా మారుతోంది. తెలంగాణ .. ఆంధ్ర రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఈ సినిమాను విడుదల చేయాలనే బలమైన ఒక టాక్ వినిపిస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. అందులో వాస్తవమెంతన్నది, అధికారిక ప్రకటన వస్తేనే గాని తెలియదు మరి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'సారంగ ధరియా' సాంగ్ యూత్ ను ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.