పవన్ సినిమా సెట్లోకి అడుగుపెడుతున్న నిత్యామీనన్!
- సెట్స్ పైకి మలయాళ రీమేక్
- పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్
- 12వ తేదీన షూటింగుకు హాజరు
- రానా సరసన ఐశ్వర్య రాజేశ్
'జనతా గ్యారేజ్' తరువాత తెలుగులో పూర్తిస్థాయి పాత్రను ఆమె చేయలేకపోయింది. అతిథి పాత్రల్లో అడపాదడపా మెరిసిన నిత్యామీనన్, ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తోంది. పవన్ కథానాయకుడిగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ రూపొందుతోంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా 40 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కరోనా కారణంగా ఆ మధ్య ఆగిపోయిన షూటింగును తిరిగి మొదలుపెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి షూటింగులో తొలిసారిగా నిత్యామీనన్ జాయిన్ కానుంది. పవన్ భార్య పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుండగా, రానా జోడిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది.