అంచనాలు పెంచుతున్న అజిత్ 'వలిమై'
- వరుస హిట్లతో ఉన్న అజిత్
- వినోద్ దర్శకత్వంలో మరోసారి
- హైలైట్ గా నిలవనున్న యాక్షన్ ఎపిసోడ్స్
- దీపావళికి భారీ స్థాయి విడుదల
ఈ సినిమాలో అజిత్ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. హుమా ఖురేషి ఆయన సరసన అలరించనుంది. ఇక తెలుగు హీరో కార్తికేయ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలో ఆయన తమిళంలో చేయడం .. అదీ అజిత్ సినిమాలో కావడం నిజంగా విశేషమే. ఇక ఈ సినిమా నుంచి రానున్న ఫస్టు లుక్ ఒక రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తుందంటే, ఈ ప్రాజెక్టుపై ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.