'రంగ్ దే' దర్శకుడితో ధనుశ్?
- తమిళంలో బిజీగా ధనుశ్
- ఈ సారి లవ్ స్టోరీ పై దృష్టి
- తెరపై వెంకీ అట్లూరి పేరు
- అధికారిక ప్రకటనతోనే సందేహాలకు తెర
అయితే శేఖర్ కమ్ముల కంటే ముందుగా మరో తెలుగు డైరెక్టర్ తో ధనుశ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ రీసెంట్ గా వినిపించింది. ఆ దర్శకుడు ఎవరబ్బా? అనే సందేహానికి సమాధానాన్ని వెతికి పట్టుకునే పనిలోనే చాలామంది ఉన్నారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు వెంకీ అట్లూరి పేరు వినిపిస్తోంది. ఇంతవరకూ ఆయన ప్రేమకథలను మాత్రమే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయనతో ధనుశ్ చేయనున్న సినిమా కూడా లవ్ స్టోరీనే అని అంటున్నారు. ఇటీవల యాక్షన్ .. ఎమోషన్ కథలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ధనుశ్, ఈ సారి లవ్ స్టోరీనే ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఇది కూడా అధికారిక ప్రకటన వస్తేనే నిజమనుకోవాలి.