చాలా ఎగ్జైటింగ్ గా ఉందంటున్న ధనుశ్!
- తమిళంలో విపరీతమైన క్రేజ్
- తెలుగులో తొలి సినిమాకి సన్నాహాలు
- శేఖర్ కమ్ముల కొత్త ప్రయోగం
- త్వరలోనే మిగతా వివరాలు
ఈ కాంబినేషన్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుశ్ తో శేఖర్ కమ్ముల సినిమా చేయనుండటం .. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటం మరింత విస్మయులను చేసింది. ఈ నేపథ్యంలో .. ధనుశ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో .. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మాణంలో కలిసి పనిచేయబోతున్నందుకు తనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నాడు. ధనుశ్ చేస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.