సైకో కిల్లర్ గా కనిపించనున్న రాశి ఖన్నా!
- గ్లామరస్ హీరోయిన్ గా మంచి క్రేజ్
- కోలీవుడ్ లోను మంచి అవకాశాలు
- హిందీ వెబ్ సిరీస్ ల పై దృష్టి
- బిజీ అవుతున్న రాశి ఖన్నా
ఆల్రెడీ హిందీలో ఆమె షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రను చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరో భారీ వెబ్ సిరీస్ లోను ఆమె డిఫరెంట్ రోల్ చేస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిరీస్ కి రాజేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సిరీస్ లో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు.