సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అజయ్ దేవగణ్ సరసన రాశిఖన్నా
- పవన్ సినిమాలో దర్శకుడు వినాయక్?
- 'ఆహా'కు మారుతి సినిమా హక్కులు
* ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ త్వరలో పవన్ కల్యాణ్ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం. పవన్, రానా హీరోలుగా రూపొందుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో ఓ గెస్ట్ పాత్రలో వినాయక్ నటించనున్నాడట.
* సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగును కేవలం 30 రోజుల్లో పూర్తిచేయనున్నారు. ఇక ఈ చిత్రం డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ ప్లేయర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనిని డైరెక్టుగా 'ఆహా'లో రిలీజ్ చేస్తారు.