అఖిల్ కథపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయట!
- సురేందర్ రెడ్డితో అఖిల్ మూవీ
- మాస్ లుక్ తో కనిపించనున్న అఖిల్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
సురేందర్ రెడ్డి ఈ సారి తన స్టైల్ కి భిన్నంగా వెళ్లడమే కాదు, అఖిల్ లోని కొత్త కోణాన్ని చూపించనున్నాడు. ఇంతవరకూ అఖిల్ చేసిన ప్రతి సినిమాలోను ఆయన డీసెంట్ లుక్ తోనే కనిపించాడు. దాదాపు విదేశాల్లోనే షూటింగు జరుపుకున్న ఆ సినిమాలు, ఇది మన దగ్గర జరుగుతున్న కథ కాదే అనే ఒక ఫీలింగ్ ను ప్రేక్షకుల్లో తీసుకురావడానికి కారణమయ్యాయి. అందువలన ఈ సారి మాస్ లుక్ తో .. వాళ్లకి కనెక్ట్ అయ్యే పాత్రలో అఖిల్ ను సురేందర్ రెడ్డి చూపించనున్నాడు. ప్రస్తుతం కథపై గట్టిగానే కసరత్తు జరుగుతోందట. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ వారితో కలిసి సురేందర్ రెడ్డి నిర్మించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.