'సలార్'లో దుమ్మురేపేసే ఐటమ్ సాంగ్!
- ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్
- ఓల్డ్ లుక్ లో కొంతసేపు కనిపించనున్న ప్రభాస్
- ఐటమ్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టి
- వచ్చే నెలలో ఐటమ్ సాంగ్ షూటింగ్
ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ లో ఎక్కడ కూడా హడావిడి ఉండదట .. ఆయన ఒక దెబ్బ కొట్టిన తరువాత తిరిగి లేచేవాడు ఉండడని చెబుతున్నారు. కథాపరంగా తెరపై ఆయన కొంతసేపు ఓల్డ్ లుక్ లోను కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమాలో అన్ని ప్రాంతాల మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ట్యూన్ తో స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. నాజూకైన సొగసులతో కట్టిపడేస్తున్న శ్రీనిధి శెట్టిని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది, వచ్చే నెల మొదటివారంలో ఈ పాటను చిత్రీకరించనున్నారట. 'సలార్'తో ఐటమ్ అంటే ఒక రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాలా?