'భీష్మ' దర్శకుడితో వైష్ణవ్ తేజ్!
- 'భీష్మ' తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
- వరుణ్ తేజ్ తో సినిమాకి మరింత సమయం
- ఈ లోగా వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టు పట్టాలపైకి
వెంకీ కుడుముల దర్శకత్వం వహిచిన 'భీష్మ' సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ఒక సినిమాను వెంకీ కుడుముల ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న సమయానికి 'గని' పూర్తికాకపోవడం వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. వరుణ్ తేజ్ సినిమా పూర్తయ్యేలోగా, వైష్ణవ్ తేజ్ తో చేయడానికి వెంకీ కుడుముల రంగంలోకి దిగాడట. వైష్ణవ్ తేజ్ కి కథ నచ్చడంతో, త్వరలోనే వీరు సెట్స్ పైకి వెళుతున్నారనే టాక్ వినిపిస్తోంది.