హరీశ్ శంకర్ ను రంగంలోకి దిగమని చెప్పిన పవన్!
- పూర్తి స్క్రిప్ట్ వినిపించిన హరీశ్ శంకర్
- జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ఇటీవల పూర్తి స్క్రిప్ట్ తో పవన్ ను హరీశ్ శంకర్ కలిశాడట. స్క్రిప్ట్ మొత్తం విన్న పవన్ కల్యాణ్ తనకి సంతృప్తికరంగా అనిపించిందని చెప్పాడట. జూలై నుంచి షూటింగు పెట్టుకోమనీ .. నెలకి పది రోజులు తన పోర్షన్ ను షూట్ చేయమని అన్నారట. అందుకు హరీశ్ శంకర్ ఓకే అనేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. అందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ ఉండేలా చూసుకోరు. ఆయన టెన్షన్ లేకుండా వరుస సినిమాలు చేసుకువెళుతుండటానికి ఇదే కారణం. ఈ సినిమాకి 'సంచారి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.