ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు కారు ఇవ్వాలన్న నెటిజన్.. తాప్సీ సమాధానం ఇది!
- కరోనా రోగులకు అవసరమైన సమాచారాన్ని పోస్టు చేస్తున్న తాప్సీ
- తనను ప్రశ్నించిన నెటిజన్‌కు సుతిమెత్తని హెచ్చరిక
- పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక సలహా ఇమ్మని సూచన
ఇది చూసిన ఓ నెటిజన్.. ‘‘ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేయకపోతే ఖరీదైన నీ కారును వాళ్లకు అందిస్తే ఏదో రకంగా ఉపయోగించుకుంటారు కదా‘‘ అని ట్వీట్ చేశాడు. స్పందించిన తాప్సీ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చెత్త మెసేజ్‌లతో తన సమయాన్ని వృథా చేయవద్దని కోరింది. ఒకవేళ మీలాంటి వాళ్లు ఇదే చెప్పాలనుకుంటే దేశం మళ్లీ సాధారణంగా ఊపిరి పీల్చుకునే వరకు నోరు విప్పొద్దని సూచించింది. తాను ఏం చేయాలనుకున్నానో అది చేయనివ్వాలంటూ ఆ నెటిజన్‌పై మండిపడింది.