పండగ రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన 'ఆదిపురుష్'
- ప్రభాస్ తొలి పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్'
- ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం
- విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం
నిన్న 'శ్రీరామనవమి' కావడంతో ఈ సినిమా నుంచి శ్రీరాముడిగా ప్రభాస్ ఫస్టులుక్ రావొచ్చునని అభిమానులు భావించారు. సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ ల పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని మరికొంతమంది ఆశించారు. సీతారాములతో పాటు హనుమంతుడి పాత్రను కూడా రివీల్ చేయవచ్చని కొందరు అనుకున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలతో నిన్నటి రోజున అంతా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా టీమ్ నుంచి అలాంటి అప్ డేట్ ఏదీ రాలేదు. దాంతో ప్రభాస్ అభిమానులంతా చాలా నిరాశ పడ్డారు. సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.