జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు తనపై తానే రాళ్ల దాడి చేసుకున్నారు: భూమన
- తిరుపతిలో నిన్న చంద్రబాబు ప్రచారం
- రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు
- అంతా డ్రామా అంటున్న వైసీపీ నేతలు
- చంద్రబాబువి నీచ రాజకీయాలన్న భూమన
గతంలో మావోయిస్టుల దాడి జరిగినప్పుడు రెండ్రోజులు ఎడమచేతికి కట్టు కట్టుకున్నారని, మరో రెండ్రోజులు కుడి చేతికి కట్టు కట్టుకుని అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు తిరుపతి ప్రజలు ఎదురుచూస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి భారీ మెజారిటీ ఖాయమని అన్నారు.