ప్రభాస్ కోసం రెడీ అవుతున్న భారీ సెట్లు!
- ప్రభాస్ నుంచి వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు
- సెట్స్ పై 'ఆది పురుష్' .. 'సలార్'
- స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో నాగ్ అశ్విన్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడట. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు చివరిదశకు వచ్చాయని అంటున్నారు. త్వరలోనే ఆయన పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడని అంటున్నారు. అలాగే కథ ప్రకారం, ఈ సినిమాకి భారీ సెట్లు అవసరం. ఆ సెట్లను వేయించే పనులు కూడా ముగింపుదశకి చేరుకున్నాయని చెబుతున్నారు. దీపికా పదుకొణే కథానాయిక పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, అమితాబ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.