కార్తి హిట్ మూవీ సీక్వెల్లో ధనుశ్!
- 2010లో కార్తి చేసిన భారీ చిత్రం
- మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్
- విజువల్ వండర్ గా తీర్చేదిద్దే ప్రయత్నం
అడవులు .. ఎడారులు .. ప్రాచీన రాజుల కాలంనాటి మూలాలు .. ఇలా ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ ను చేయడానికి సెల్వరాఘవన్ రంగంలోకి దిగాడు. విశేషమేమిటంటే ఈ సీక్వెల్ లో కార్తి కాకుండా ధనుశ్ కనిపించనున్నాడు.
ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సెల్వరాఘవన్, గ్రాఫిక్స్ వారు చేయవలసిన పనిని కూడా వాళ్లకి అప్పగించేయడం జరిగిందని అంటున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ కారణంగానే ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంత ఆలస్యం అంటే .. 2024లో విడుదల చేసేంత అన్నమాట. ఇతర నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే షూటింగు మొదలుపెడతారట.