ఎమ్మెల్సీ సతీశ్ కు కరోనా పాజిటివ్.. శాసనమండలిలో కలకలం
- తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
- సతీశ్ కు కరోనా సోకడంతో ఆందోళనలో ఎమ్మెల్సీలు
- అసెంబ్లీ సమావేశాలు ముందుగానే ముగిసే అవకాశం
ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ రాగా... ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.
మరోవైపు పురాణం సతీశ్ కు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యుల్లో కలవరం మొదలైంది. శనివారం ఆయన మండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోపక్క, కరోనా నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రేపో, ఎల్లుండో సమావేశాలను ముగించే అవకాశం ఉంది.