మళ్లీ షూటింగుకి రెడీ అవుతున్న సూపర్ స్టార్!
- శివ దర్శకత్వంలో రజనీకాంత్ 'అన్నాత్తే'
- డిసెంబర్లో షూటింగులో వుండగా అస్వస్థత
- ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్
- మార్చ్ 15 నుంచి తిరిగి షూటింగ్ మొదలు
ఇక ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో చిత్రం షూటింగును తిరిగి ప్రారంభించుకోమని దర్శక నిర్మాతలకు చెప్పారట. ఈ నేపథ్యంలో షూటింగును వచ్చే నెల 15 నుంచి తిరిగి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, షూటింగును తిరిగి హైదరాబాదులో నిర్వహిస్తారా? లేక చెన్నైలోనే జరుపుతారా? అన్నది ఇంకా వెల్లడికాలేదు. వచ్చే నవంబరు 4న విడుదల కానున్న ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్నారు.