గుణశేఖర్ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు?
- అప్పుడప్పుడు మాటలు రాస్తున్న త్రివిక్రమ్
- తాజాగా రెండు సినిమాలకు సంభాషణలు
- 'హిరణ్య కశిప' కోసం గుణశేఖర్ రిక్వెస్ట్
- ఇంకా ఏ విషయం చెప్పని త్రివిక్రమ్
గతంలో అలాగే, 'తీన్ మార్' సినిమాకి రాశారు. ఇప్పుడు అల్లు అరవింద్ హిందీలో నిర్మించే 'రామాయణం చిత్రానికి, పవన్ నటించే 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రానికి కూడా సంభాషణలు రాస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో భారీ చిత్రానికి కూడా మాటలు రాయనున్నట్టు సమాచారం.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్య కశిప' పేరిట భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు రాయాల్సిందిగా ఇటీవల త్రివిక్రమ్ ని గుణశేఖర్ రిక్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ విషయం చెప్పలేదని అంటున్నారు. అయితే, ఆయన రాసే అవకాశాలు ఎక్కువగానే వున్నాయని సమాచారం.