నీ సంకల్పానికి శాల్యూట్.. నయనతారకు సమంత విషెస్!
- రెండు దశాబ్దాలుగా అగ్రతారగా రాణిస్తున్న నయన్
- ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ముద్దుగుమ్మ
- 'మాలాంటి వాళ్లకు నువ్వు స్ఫూర్తి' అన్న సమంత
- 'హ్యాపీ బర్త్ డే బంగారం' అంటూ ప్రియుడి విషెస్
అలాంటి అందాల నయనతార ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కోవలో మరో అగ్రతార సమంత సోషల్ మీడియా వేదికగా ఆమెకు చెప్పిన విషెస్ ఆసక్తికరంగా వున్నాయి. 'నయనతార సిస్టర్ కు హ్యాపీ బర్త్ డే.. నువ్వు ఇంకా రాణిస్తూనే ఉండాలి.. మాలాంటి వాళ్లకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండాలి.. నీ శక్తికి, సంకల్పానికి శాల్యూట్ సిస్టర్' అంటూ సమంత విషెష్ చెప్పింది.
ఇక నయనతార ప్రియుడు, కాబోయే భర్త అయిన దర్శకుడు విఘ్నేశ్ శివన్ అయితే, 'హ్యాపీ బర్త్ డే బంగారం' అంటూ విషెస్ చెప్పాడు.