బిగ్ బాస్ 4 లీక్... నేడు కల్యాణితో పాటు ఎలిమినేట్ అయ్యేది ఇతనేనట!
- రెండో వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్
- నేడు సాయి కుమార్ ఎలిమినేట్
- సోషల్ మీడియాలో ప్రచారం
ఇక, నామినేషన్స్ లో మిగిలింది నోయల్, మోనాల్ గుజ్జర్, సయ్యద్ సోహైల్, అమ్మ రాజశేఖర్, సాయి కుమార్, అలేఖ్య హారిక, అభిజిత్ కాగా, వీరిలో కుమార్ సాయి నేడు ఎలిమినేట్ కాబోతున్నాడని లీక్ అయింది. ఈ ఎపిసోడ్ ను నిర్వాహకులు ఇప్పటికే చిత్రీకరించగా, ప్రతి ఏటా వస్తున్నట్టుగానే, బిగ్ బాస్ హౌస్ లో మరుసటి రోజు జరిగే ఘటనల గురించి ముందే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే విధంగా నేడు సాయి కుమార్ ఎలిమినేట్ కానున్నాడని ప్రచారం జరుగుతోంది.