మళ్లీ వార్తల్లోకి వచ్చిన అల్లు అర్జున్ 'ఐకాన్'!
- 'అల వైకుంఠపురములో'కి ముందు చేయాల్సిన 'ఐకాన్'
- స్క్రిప్టు పట్ల బన్నీ అసంతృప్తి వల్ల ఆగిపోయిన ప్రాజక్టు
- ఆ ప్రాజక్టు తప్పకుండా ఉందంటున్న దర్శకుడు వేణు
- కొరటాల శివ సినిమా తర్వాత వుండే అవకాశం
అయితే, అంతలోనే ఆ సినిమా సెట్స్ కి వెళ్లకుండా ఆగిపోవడం... ఆ స్థానంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందడం జరిగిపోయింది. స్క్రిప్టులో ఎక్కడో తనకు అసంతృప్తిగా ఉండడంతో ఆ ప్రాజక్టును బన్నీ హోల్డ్ చేసినట్టు వార్తలొచ్చాయి.
ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం గురించిన సమాచారం వస్తోంది. ఈ చిత్రం ఆగిపోలేదనీ, ఈ సినిమా విషయంలో తాను బన్నీతో టచ్ లోనే ఉన్నాననీ దర్శకుడు వేణు శ్రీరాం తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది కచ్చితంగా ఉంటుందని కూడా అన్నాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజక్ట్ కమిట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఈ 'ఐకాన్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళతారని అంటున్నారు. ఈలోగా వేణు శ్రీరాం 'వకీల్ సాబ్' చిత్రంతో హిట్ కొడితే కనుక ఇక ఆ ప్రాజక్టుకి ఢోకా వుండదు!