'ఆచార్య'లో రామ్ చరణ్ కి జోడీగా రష్మిక?
- 'ఆచార్య'లో కీలక పాత్రలో చరణ్
- జోడీగా కియరా అద్వానీ పేరు ప్రచారం
- తాజాగా రష్మిక పేరు తెరపైకి
బాలీవుడ్ నటి కియరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన కథానాయికగా నటిస్తుందంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, తాజాగా రష్మిక పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరి, రష్మిక ఎంపిక పూర్తయిందా? లేక కియరానే నటిస్తుందా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!