సుశాంత్ ఖాతా నుంచి కోట్ల రూపాయలు మాయం... రియాపై అనుమానం వ్యక్తం చేసిన సుశాంత్ తండ్రి!
- ఇప్పటికే పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన కేకే సింగ్
- రూ.15 కోట్లను మూడు బ్యాంకులకు మళ్లించినట్టు ఆరోపణ
- ఆ ఖాతాలు రియా, ఆమె సోదరుడివేనని వెల్లడి
సుశాంత్ ఖాతాలో రూ.17 కోట్లు ఉండగా, రూ.15 కోట్లు మూడు వేర్వేరు బ్యాంకులకు బదిలీ అయినట్టు తెలుస్తోందని వివరించారు. ఆ బ్యాంకు ఖాతాలు రియా, ఆమె సోదరుడివేనని తెలిపారు. దీనిపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీహార్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని, సుశాంత్ బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.