వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ
- పూర్తి కాని 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్
- ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్రాజెక్టు ఆలస్యం
- తెరపైకి వెంకటేశ్ పేరు
దాంతో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగును పూర్తి చేసి ఎన్టీఆర్ వచ్చేలోగా మరో హీరో ప్రాజెక్టును పూర్తి చేయాలనే నిర్ణయానికి త్రివిక్రమ్ వచ్చినట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ హీరో వెంకటేశ్ అనేది తాజా సమాచారం. వెంకటేశ్ తో ఓ సినిమా చేయాలని గతంలోనే త్రివిక్రమ్ అనుకున్నాడు. కథ కూడా ఓకే చేసి వుంది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఆ కథను ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు.