త్రివిక్రమ్ ముందుచూపు .. రొమాంటిక్ లవ్ స్టోరీ సిద్ధం
- ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ
- 'ఆర్ ఆర్ ఆర్' పూర్తి చేయవలసిన ఎన్టీఆర్
- మరో ప్రాజెక్టు హీరోలుగా తెరపైకి నాని - చైతూ పేర్లు
'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ పోర్షన్ కి సంబంధించిన షూటింగు ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అందువలన ఈ లోగా ఓ మాదిరి బడ్జెట్ లో 'అ ఆ' వంటి సినిమా ఒకటి చేయాలనే ముందుచూపుతో త్రివిక్రమ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన హీరోలుగా నాని .. చైతూ పేర్లు తెరపైకి వచ్చాయి. 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఎన్టీఆర్ రావడం ఆలస్యమైతే, ఈ లోగా త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును పూర్తి చేసేస్తాడన్న మాట.