సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తొలిసారి జతకడుతున్న నయన్!
- మహేశ్ అలా ప్లాన్ చేశాడు
- బన్నీ పాత్రలో శివకార్తికేయన్
* 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పిన సంగతి విదితమే. ఇక ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో మహేశ్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. షూటింగ్ మొదలుపెట్టాక ఎక్కువ బ్రేక్ లంటూ లేకుండా చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్టు, ఆ విధంగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. దాంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం తమిళ రీమేక్ లో శివకార్తికేయన్ నటించనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.