పవన్ కథపైనే కసరత్తు చేస్తున్న హరీశ్ శంకర్
- మరోసారి పవన్ తో హరీశ్ శంకర్
- మాస్ కథాంశంతో రంగంలోకి
- మళ్లీ పూజ హెగ్డేకే ఛాన్స్
ఇక త్వరలో చేయనున్న సినిమాకి సంబంధించిన కథపైనే హరీశ్ శంకర్ కసరత్తు చేస్తున్నాడట. పవన్ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ కథలో ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఐటమ్ సాంగ్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసే విధంగా ఆయన కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.
'దువ్వాడ జగన్నాథం'తో పూజా హెగ్డే కెరియర్ మళ్లీ ఊపందుకునేలా చేసిన హరీశ్ శంకర్, పవన్ సరసన కథానాయికగా ఆమెనే ఎంచుకున్నాడు. పవన్ .. క్రిష్ మూవీ పూర్తి చేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.