ఇటువంటి అసత్య ఆరోపణలతో రాష్ట్రాన్ని నిందించకండి: దర్శకుడు హరీశ్ శంకర్ ఆగ్రహం
- సైబరాబాద్‌లో తన హోటల్ బాల్కనీ పూర్తిగా పాడైపోయిందన్న శేఖర్ గుప్తా
- విద్యుత్ సరఫరా అంతరాయంతో ఇబ్బందులని వ్యాఖ్యలు
- చెడు ప్రచారం చేయాలనుకుంటే మంచి కథను ఎంచుకోండన్న హరీశ్ శంకర్
- ఇప్పటివరకు తాము 'పవర్ ఫుల్' గా ఉన్నామని ట్వీట్
దీనిపై స్పందించిన సినీ దర్శకుడు హరీశ్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు చెడు ప్రచారం చేయాలనుకుంటే మంచి కథను ఎంచుకుని చేయండి.. అంతేగానీ, ఇటువంటి అసత్య ఆరోపణలతో రాష్ట్రాన్ని నిందించకండి. టీఆర్‌ఎస్ పార్టీ సారథ్యంలో ఇప్పటివరకు మేము 'పవర్ ఫుల్' గా ఉన్నాం' అని హరీశ్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. కాగా, తెలంగాణలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందుతోందని నెటిజన్లు అంటున్నారు. అటువంటప్పుడు శేఖర్ గుప్తా ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీస్తున్నారు.