బ్రేకింగ్... నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం!
- తలను గోడకేసి బాదుకున్న వినయ్ శర్మ
- ఉరి తప్పించుకోవాలని చూస్తున్న దోషులు
- మార్చి 3న ఉరి అనుమానమే
ఈ నేపథ్యంలో దోషి వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. తనను ఉంచిన సెల్ లో గోడకు తలను బాదుకున్నాడని, ఈ ఘటనలో వినయ్ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో ఎలాంటి జాప్యం చోటు చేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి అభిలషించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటివరకూ తన ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని దోషి పవన్ గుప్తా, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో 3వ తేదీన వారి ఉరి అనుమానంగానే ఉంది.