పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం!
- నిన్న లీటర్‌పై రూ.3 పెంపు
- సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం
- దశలవారీగా రూ.10 పెంచే అవకాశం
పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు రూ.3 పెంచాయని, కానీ ఈ పెంపు చాలదని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు వారాల్లో దశలవారీగా పెరుగుదల ఉండవచ్చని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును దాదాపు నిలిపివేసింది. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కూడా లాభాలను వదులుకుని అధిక వ్యయాన్ని భరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఇంధన ధరలు పెంచుతున్నాయి. నిన్న పెరిగిన స్వల్ప పెరుగుదల కూడా కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప తొలగించలేదు.