విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు
- విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
- ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్
- ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు
- సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా బలపడతాయని, రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ మైలురాయి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రైల్వే జోన్ ఏర్పాటును సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని నారా లోకేష్ గుర్తుచేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ కల నెరవేరిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.