ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై
- టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
- 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం
- మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి చెందారు. ఆయన తనయుడు ఉదయనిధి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో డీఎంకే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓడిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థి వెంకటరామనన్ సమీప డీఎంకే అభ్యర్థిపై 28 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తమిళిసై మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు 32,328 ఓట్లు మాత్రమే వచ్చాయి.