క్రికెట్లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్
- మీ వికెట్ మీరు పారేసుకుంటే శాశ్వతంగా పైకి పోతారన్న సజ్జనార్
- యమధర్మరాజు వద్ద డెత్ రివ్యూ సిస్టం ఉండదని వ్యాఖ్య
- క్రికెట్ అభిమానం ఉండొచ్చు.. వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని సూచన
క్రికెట్ మైదానంలో వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడని, కానీ రోడ్డు మీద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే మాత్రం శాశ్వతంగా పైకి వెళతారని హెచ్చరించారు. క్రికెట్లో అంపైర్ నిర్ణయంపై రివ్యూ అడిగే అవకాశం ఉంటుందని, కానీ రోడ్డు మీద ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తే డీఆర్ఎస్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లో స్కోర్ బోర్డు చూస్తూ మీ జీవితాన్ని 'జీరో'కి క్లీన్ బౌల్డ్ చేసుకోవద్దని సూచించారు.
మీకు మ్యాచ్ ముఖ్యం కావొచ్చు కానీ మీ కోసం ఇంట్లో ఎదురుచూసే మీ కుటుంబానికి మీరు మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలని అన్నారు. క్రికెట్‌పై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ ప్రాణాలు తీసే వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు.