కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి
- దాహం తీర్చుకునేందుకు ఊళ్లోకి వచ్చినట్లు అనుమానం
- దువ్వూరు మండలం చిన్నబకరాపురంలో వెలుగు చూసిన ఘటన
- మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు
- పోస్టుమార్టం నిమిత్తం దువ్వూరు పశువైద్యశాలకు తరలింపు
గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.