మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత!
- మమల్డే గ్రామంలో పసికందుతో ఆరుబయట నిద్రించిన భార్యాభర్తలు
- చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన చిరుత
- పొలాల్లో శిశువు మృతదేహ అవశేషాలు లభ్యం
- భయాందోళనలో గ్రామస్థులు, అధికారులపై ఆగ్రహం
సమాచారం అందుకున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది చిరుతపులి దాడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువైందని, పలుమార్లు పశువులపై కూడా దాడి చేశాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పసికందు మృతితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు, చిరుతను వెంటనే బంధించి తమకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.