'సూపర్ వెల్లి'... కొత్త జానర్ ట్రై చేస్తున్న ఆదా శర్మ
- సూపర్ ఉమన్ అవతారమెత్తిన నటి అదా శర్మ
- ఆమె కొత్త చిత్రానికి ‘సూపర్ వెల్లి’ అనే టైటిల్ ఖరారు
- సోమరితనం, గందరగోళంతో ఉండే పాత్రలో అదా
- ‘ది కేరళ స్టోరీ’ తర్వాత పూర్తి భిన్నమైన జానర్‌లో సినిమా
ఈ చిత్రంలో అదా శర్మ పాత్ర చాలా భిన్నంగా ఉండనుంది. ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరోలా కాకుండా, తన శక్తులతో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే సోమరి, గందరగోళ స్వభావం ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌లో కూడా, ప్రపంచాన్ని రక్షించడం కంటే నిద్రపోవడానికే ఇష్టపడే పాత్రగా ఆమెను చూపించారు.
దర్శకుడు రాజేష్ బచ్చాని మాట్లాడుతూ.. "కమాండో సినిమాలో అదా చేసిన భావనా రెడ్డి పాత్ర నాకు గుర్తుంది. ఆమెలోని సహజమైన ప్రతిభ, చురుకుదనం, హాస్యం చూశాక మా ‘సూపర్ వెల్లి’ పాత్రకు ఆమే సరైన ఎంపిక అనిపించింది. మూడేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాం" అని తెలిపారు.