హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
- ఎల్ అండ్ టీతో సూత్రప్రాయంగా గత ఏడాది ఒప్పందం
- రూ.13 వేల కోట్ల రుణాలను బదలాయించుకోనున్న ప్రభుత్వం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావులతో ఈ ఉపసంఘాన్ని నియమించింది. గత సంవత్సరం సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో ఎల్ అండ్ టీకి రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా చెల్లించాలని, రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకోవాలని అవగాహనకు వచ్చాయి. నాటి నుంచి స్వాధీన ప్రక్రియ ప్రారంభమైంది.