ప్రపంచ వేదికలపై దేశాన్ని అవమానిస్తారా: 'ఏఐ' సదస్సులో కాంగ్రెస్ తీరుపై అఖిలేశ్ ఆగ్రహం
- ఏఐ సదస్సు వద్ద అర్ధనగ్న నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్
- అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా ప్రపంచవేదికలపై కాంగ్రెస్ తీరు సరికాదన్న అఖిలేష్
- మన దేశానికి అవమానం కలిగించేలా ప్రవర్తించకూడదన్న మాజీ సీఎం
మనకు అంతర్గతంగా ఎన్ని విభేదాలు అయినా ఉండవచ్చని, కానీ ప్రపంచ వేదికపై కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అఖిలేష్ యాదవ్ అన్నారు. విదేశీ ప్రతినిధులు, ప్రపంచ ప్రతినిధుల ముందు మన దేశానికి అవమానం కలిగించేలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని అన్నారు. 'ఇండియా' కూటమిలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యూత్ కాంగ్రెస్ తీరును తప్పుబట్టడం గమనార్హం.